Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు మాత్ర‌మే చెప్తా టీజ‌ర్ టాక్ ఏంటి..?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (21:27 IST)
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంచ‌ల‌న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టివ‌రకు హీరోగా స‌క్స‌స్ సాధించిన ఈ హీరో నిర్మాత‌గా కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించ‌కోబోతున్నాడు. అవును.. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా మారి సినిమాలు తీయ‌నున్నాడు. 
 
కింగ్ ఆప్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న తొలి చిత్రం మీకు మాత్రమే చెప్తా. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. 
 
ద‌ర్శ‌కుడు తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీలో అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
 
తాజాగా ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ఫన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. మీకు మాత్రమే చెప్తా అనే క్యాచీ టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ టీజర్‌తోనే ప్రామిసింగ్ మూవీ అనిపించుకుంటోంది.
 
 చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి ఎంటర్టైనర్‌లా కనిపిస్తోంది. ఇక థియేటర్లో పూర్తిగా నవ్వులు పంచేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. విజ‌య్ నిర్మాత‌గా కూడా రాణిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments