నాని టైటిల్ సాంగ్ రిలిక్స్.. పాస్‌బుక్‌లో పైసల కన్నా ఫేస్‌బుక్‌లో (వీడియో)

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ సాంగ్.. ''వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (13:18 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ సాంగ్.. ''వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీ ఏమో వ‌న్ బై టూ" అంటూ సాగుతోన్న ఈ సాంగ్‌ లిరిక్స్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది.
 
"పాస్‌బుక్‌లో పైస‌ల క‌న్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ" అనే ఈ పాట‌లోని రెండు లైన్ల‌ను నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంటూ ఈ పాట‌ను విడుద‌ల చేశాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ''ఫిదా'' సినిమా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఇంకా ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌ పోషిస్తోంది. ఎంసీఎ మూవీ త‌ప్ప‌కుండా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో తమ బ్యాన‌ర్ వాల్యూను పెంచే చిత్ర‌మ‌వుతుందని సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న నాని ఎంసీఏ డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments