Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ''మాస్టర్‌''ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్: నిర్మాత

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (08:45 IST)
Mahesh Koneru
దళపతి విజయ్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ బ్యానర్‌పై గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించిన చిత్రం ‘మాస్ట‌ర్‌’. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న మాస్ట‌ర్ సినిమాను తెలుగులో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు విడుద‌ల చేశారు. విజిల్ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో విజ‌య్ హీరోగా న‌టించిన ‘మాస్ట‌ర్‌’ సినిమా విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
 
ఈ సందర్భంగా... ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్ష‌న్స్ అధినేత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ ‘‘ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైన ‘మాస్ట‌ర్‌’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఈ సినిమా హీరో విజ‌య్‌గారి కెరీర్‌లోనే బెస్ట్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఒకటి, రెండు ఏరియాలు మిన‌హా అన్ని ఏరియాల్లో బ‌య్య‌ర్లు బ్రేక్ ఈవెన్‌తో ప్రాఫిట్స్ జోన్‌లో ఎంట‌ర్ అయ్యారు. 
 
ఈ రెండు రోజుల్లో  మిగిల‌న ఏరియాల బ‌య్య‌ర్ల‌కు కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ సినిమాకు ఇంత‌టి విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేసే అవ‌కాశం క‌లిగించిన ద‌ళ‌ప‌తి విజ‌య్‌గారికి, నిర్మాత‌లు బ్రిట్టో, ల‌లిత్, జ‌గ‌దీష్‌గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఏప్రిల్‌లో విడుదలకు సిద్దంగా వున్న ఈ సినిమా కోవిడ్ కార‌ణంగా.. సంక్రాంతికి విడుద‌లైంది. 
 
ఈ చిత్రాన్ని నైజాంలో విడుద‌ల చేసిన దిల్‌రాజుగారికి, ఆంధ్ర ఏరియాను కోనుగోలు చేసిన రాజేశ్‌గారికి, సీడెడ్‌లో విడుద‌ల చేసిన కేఎఫ్‌సీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారికి ధ‌న్య‌వాదాలు. ఆంధ్రాలో కూడా వైజాగ్‌ను దిల్‌రాజుగారు, ఈస్ట్ భ‌ర‌త్ చౌద‌రిగారు, వెస్ట్ ఉషా పిక్చ‌ర్స్‌, కృష్ణా రాజేశ్‌, గుంటూరు పద్మాకర్ సినిమాస్, నెల్లూరు డాక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్ అంద‌రూ అద్భుత‌మైన రిలీజ్‌ను ఇచ్చారు. 
 
విజ‌య్‌గారి విజిల్ త‌ర్వాత తెలుగులో మేం విడుద‌ల చేసిన రెండో సినిమా మాస్ట‌ర్‌. విజిల్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి మ‌రో హిట్‌ను ద‌క్కించుకున్నాం. త్వ‌ర‌లోనే విజ‌య్‌గారితో మ‌రో సినిమా చేసే అవ‌కాశం వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ‌స్తున్న రెస్పాన్స్‌కు విజ‌య్‌గారు చాలా హ్యాపీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాల‌న్నీ బ్ర‌హ్మాండంగా ఆడుతున్నాయి. 
 
డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీనుగారు క్రాక్ థియేట‌ర్స్‌ను నైజాం నుండి ఈ సినిమా కోసం తీసేసుకున్నామంటూ మాట్లాడారు. స‌మ‌స్య గురించి మాట్లాడాలి కానీ.. వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం స‌రికాదు. ఇక క్రాక్ థియేట‌ర్స్ స‌మ‌స్య విష‌యానికి వ‌స్తే జ‌న‌వ‌రి 9న క్రాక్ విడుద‌లైన‌ప్పుడు 300 నుంచి 325 థియేట‌ర్స్‌లో సినిమా విడుద‌లైంది. నాలుగు రోజుల పాటు సినిమా బ్ర‌హ్మాండంగా ఆడింది. 
 
ఇక మాస్ట‌ర్ సినిమా భారీగా విడుద‌లైంది. తెలుగు, త‌మిళంలో ఒకేరోజున విడుద‌లైతే బావుంటుంది. ముందుగానే మాస్ట‌ర్‌ను జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేస్తామ‌ని చెప్పాం. దాని ప్ర‌కార‌మే రెడీ అయ్యాం. ఓపెనింగ్ రోజున ఎక్కువ థియేట‌ర్స్ ఉంటాయ‌ని, మిగిలిన సినిమాలు విడుద‌లైతే థియేట‌ర్స్ సంఖ్య త‌గ్గుతాయ‌ని ముందే చెప్పారు. నైజాంలో తొలిరోజున మాస్ట‌ర్ 150-160 థియేట‌ర్స్లో విడుద‌లైంది. 
 
కానీ రెండో రోజుకి అది 75-80 థియేట‌ర్స్‌కి తగ్గింది. ఆ విష‌యం నాకు ముందుగానే తెలిసిన ప‌రిస్థితుల ప్ర‌కారం నేను ముందుకొచ్చాను. క‌లెక్ష‌న్స్ బ్రహ్మాండంగా వ‌చ్చాయి. రెడ్‌, అల్లుడు అదుర్స్ సినిమాలు విడుద‌ల కాగానే క్రాక్‌, మాస్ట‌ర్ కంటే వీటికే ఎక్కువ థియేట‌ర్స్ ఇచ్చారు. 
 
ఇలాంటి పండ‌గ టైమ్‌లో రెవెన్యూ కావాల‌నుకుంటే స్క్రీన్స్‌ను అంద‌రూ షేర్ చేసుకోవాలి.. త‌ప్ప‌దు. ప్యాన్ ఇండియా సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు అన్ని రాష్ట్రాల డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎగ్జిబిట‌ర్స్ కో ఆప‌రేట్ చేస్తారు. మాస్ట‌ర్ త‌మిళ సినిమానే అయినా, డ‌బ్బులు మ‌న తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కే క‌దా వ‌చ్చింది. అన్ని సినిమాలు బాగా ఆడుతున్న స‌మ‌యంలో ఇలా కాంట్ర‌వ‌ర్సీ మాట్లాడ‌టం క‌రెక్ట్ కాద‌ని నేను భావిస్తున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments