Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజా రవితేజ రావణాసుర థీమ్ సాంగ్

ravanasura team
Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (19:05 IST)
ravanasura team
మాస్ మహారాజా రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా  నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు.
 
ravanasura theam song
ఈరోజు రావణాసుర’ థీమ్ సాంగ్  ని విడుదల చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ హైలీ ఎనర్జిటిక్ గా  కంపోజ్ చేశారు. ‘రావణ’ అనే చాంట్ తో మొదలైన ట్రాక్ వైబ్రెంట్ గా వుంది. పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ ఎనర్జిటిక్ గా అలపించారు. పాట చరణంలో వినిపించిన శివతాండవం గూస్ బంప్స్ తెప్పించింది. మేకర్స్ విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ థీమ్ సాంగ్ ‘రావణాసుర’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా  ప్రారంభమయ్యాయి.
 
ఇప్పటికే గ్లింప్స్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
 
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  
 విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
ఏప్రిల్ 7,2023న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments