Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేరేజ్ ఈజ్ నాట్ లైసెన్స్ టు ఫ‌క్ అంటోన్న మ్యాడ్‌

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (18:23 IST)
Mad movie
పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం``మ్యాడ్‌`. ఓ అమ్మాయి వేసే పెయింటింగ్ చూసి ముచ్చ‌ట‌ప‌డిన అబ్బాయి పెద్ద‌ల అంగీకారంతో ఆ అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. మొద‌టిరాత్రి నాడు శృంగారానికి సిద్ధ‌మ‌వుతుండ‌గా మేరేజ్ ఈజ్ నాంట్ లైసెన్స్ టు ఫ‌క్ అంటూ అబ్బాయికి క్లాస్ పీకుంది. దాంతో తాను రేపిస్ట్‌లా వున్నానా! అంటూ స్నేహితుడితో షేర్ చేసుకుంటాడు. మ‌రి ఆ స్నేహితుడు లైఫ్ చాలా స‌ర‌దాగా వుంటుంది. స‌హ‌జీవ‌నం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మ‌రి ఆ జంట‌కు బ్రేక్ వ‌స్తుంది. అది ఏమిటి? ఎలా అనేది? `మ్యాడ్` సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇటీవ‌లే విడుద‌లైన మ్యాడ్ ట్రైల‌ర్ అనూహ్య‌స్పంద‌న వ‌స్తోంది. ట్రెండ్‌లో సాగుతోంది. ఇది ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిబింబంగా నిర్మాత‌లు చెబుతున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అస‌లు మ్యాడ్ అంటే, ఇదేదో పిచ్చి అని అర్థంకాదు. మేరేజ్ అండ్ డివోర్స్ అని అర్థం అని అది సినిమాలో తెలుసుకోవాల‌ని చెబుతున్నాడు.
ట్రైల‌ర్‌లోనే సినిమాకు కావాల్సినంద స్ట‌ఫ్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇచ్చేశారు. బ‌య‌ట‌, స్విమ్మింగ్ ఫూల్‌లోనూ ముద్దు సీన్లు పెట్టేశారు. ఇవి క‌థ‌నం ప్ర‌కారం సాగుతాయ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. మ‌రి ఈనెలాఖ‌రున విడుద‌ల త‌ర్వాత ఈ చిత్రం ఎటువంటి ఆద‌ర‌ణ పొందుతుందో చూడాల్సిందే.
రెండు జంట‌లుగా మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ నటించారు. టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మాత‌లు. లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సంబంధిత వార్తలు

టీటీడిలో గతంలో జరిగిన మోసాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలి

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే కోడలు త్రిషా రెడ్డి.. బాబు ప్రమాణ స్వీకారంలో హైలైట్

నోటి దూల వల్లే ఓడిపోయాం.. అనిల్ యాదవ్

సీఎం చంద్రబాబు నాయుడికి పూలబాట వేసిన అమరావతి రైతులు (video)

బీఆర్ఎస్‌కు కొత్త చిక్కు.. గొర్రెల పంపిణీలో అవకతవకలు

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments