Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి కథతో కూడిన మార్కెట్ మహాలక్ష్మి పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు

డీవీ
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (17:01 IST)
Producer Akhilesh Kalaru
సినిమాలంటే చాలా ఇష్టం, ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. "మార్కెట్ మహాలక్ష్మి" కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. మరిన్ని సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానం సాధించాలని ఆశిస్తున్నాను... అని చిత్ర నిర్మాత అఖిలేష్ కలారు అన్నారు. 
 
బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు సినిమా గురించి పలు విషయాలను తెలిపారు.
 
-  నా పేరు అఖిలేష్ కలారు. నేను ఇండియానాపోలిస్, USలో ఉంటున్నాను & ఫార్చ్యూన్ 500 కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా పరిశ్రమలో పనిచేయాలని అనుకున్నాను. కుటుంబ కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను మొదట ఆ బాధ్యతలను పూర్తి చేసి, ఆపై నా అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.
 
= దర్శకుడు విఎస్ ముఖేష్ నాకు దాదాపు రెండేళ్లుగా తెలుసు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు తెలుసు. 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్. "మార్కెట్ మహాలక్ష్మి" కథను ఆయన చెప్పినప్పుడు, నేను దానిని ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాను.
 
- "మార్కెట్ మహాలక్ష్మి" కథ చాలా సింపుల్. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. మేము మా ప్రమోషన్‌లలో  ఒక మెయిన్ పాయింట్ నీ చెప్పలేదు. ఆ పాయింట్ 19వ తేదీన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం.
 
- US లో ఉంటూ, India లో షూటింగ్ ఎలా మేనేజ్ అనేది  మొదట్లో నాకు ఆ డౌట్స్ ఉండేది ఇండియాలో షూటింగ్ మేనేజ్ చేస్తూ, ఇక్కడ యూఎస్ లో జాబ్ ఎలా మేనేజ్ చేయాలా అని. అయితే, మా చేతిలో మంచి టీమ్ ఉంది, డైరెక్టర్ ముఖేష్ వాళ్లని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు. నా పని కొంచెం ఈజీ అయిపోయింది.
 
=  సినిమా కంప్లీట్ అయ్యాక చూసి పెద్ద నటీనటులతో ఈ సినిమా చేస్తే బాగుండేదని నాకెప్పుడూ అనిపించలేదు. పార్వతీశం, ప్రణీకాన్విక, అవినాష్, బాషా మరియు ఇతర నటీనటులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
 
- దర్శకుడు ముఖేష్‌ నాకు చెప్పిన కథనే తెరపైకి తెచ్చారు. ముఖేష్ కథ చెప్పినప్పుడు నేను వారి పాత్రలను విజువలైజ్ చేసుకున్నాను. ఫైనల్ గా సినిమా చూసాక, నేను ఊహించిన వాటిని తెరపై చూసినట్టు అనిపించింది.
 
- నేను పెట్టుబడి పెట్టిన డబ్బును "మార్కెట్ మహాలక్ష్మి" రికవరీ చేస్తుందని నమ్ముతున్నాను. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం చాలా కష్టం, కానీ మేము దానిని విజయవంతంగా పూర్తి చేసాము.  ఏప్రిల్ 19న విడుదల కూడా చేయబోతున్నాము. మా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments