Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోజ్‌ బాజ్‌పాయ్‌కి కరోనా.. హోమ్‌ క్వారంటైన్‌కి నటుడు

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (20:33 IST)
Manoj Bajpayee
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌కి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఆయన హోమ్‌ క్వారంటైన్‌కి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా ఏ విధంగా విజృంభిస్తుందో తెలియంది కాదు. ఈ మధ్య బాలీవుడ్‌ సెలబ్రిటీలైన కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఒకవైపు వ్యాక్సిన్‌ వచ్చినా.. మహారాష్ట్రలో మాత్రం కరోనా కంట్రోల్‌లోకి రావడం లేదు. ఇంకా భయాందోళన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయనేదానికి మహారాష్ట్ర స్టేటే ఉదాహరణ. ఒక్క మహారాష్ట్ర అనే కాదు.. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది.  
 
ఇక మనోజ్‌ బాజ్‌పాయ్‌ విషయానికి వస్తే.. ఆయన ఇటీవలే 'ద ఫ్యామిలీ మ్యాన్‌' అనే వెబ్‌ సిరీస్‌తో సందడి చేశారు. తాజాగా ఆయన 'డెస్పాచ్‌' అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. 
 
మనోజ్‌ బాజ్‌పాయ్‌తో పాటు.. చిత్ర డైరెక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో.. వారు హోమ్‌ క్వారంటైన్‌కి వెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుని తిరిగి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments