Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులకు కారణం నేనే... నా భర్త చాలా మంచోడు... మనీషా కొయిరాలా... మాజీ భార్యలు ఎందుకిలా?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు చాలా మంచోళ్లని చెప్పుకోవడం ఎక్కువవుతోంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది ప్రక్కనబెడితే తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చేరిపోయింది. జెంటిల్మన్, ఒకే ఒక్క

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (16:42 IST)
ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు చాలా మంచోళ్లని చెప్పుకోవడం ఎక్కువవుతోంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది ప్రక్కనబెడితే తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చేరిపోయింది. జెంటిల్మన్, ఒకే ఒక్కడు, బొంబాయి వంటి హిట్ చిత్రాల్లో నటించి కుర్రకారును ఓ ఊపు ఊపిన మనీషా కొయిరాలా ప్రముఖ వ్యాపారవేత్త సమ్రాట్ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుంది. 
 
2010లో నేపాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడితో తన వైవాహిక బంధం సాగడం దుర్లభం అంటూ అతడిని విమర్శిస్తూ ఫేస్ బుక్‌లో పోస్టులు కూడా చేసింది. చివరికి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు క్యాన్సర్ బారిన పడి, ఆ జబ్బును జయించి బయటపడింది. 
 
ఐతే ఇప్పుడు ఆమె ఓ విషయాన్ని చెప్పింది. అదేమిటంటే... తన వైవాహిక బంధం విచ్ఛన్నం కావడానికి కారణం తనేనంటూ బయటపడింది. తప్పు చేసింది తనేనంటూ వెల్లడించింది. ఐతే నాలుగైదేళ్ల క్రితం వరకూ భర్తంటే కస్సుమనే మనీషా కొయిరాలా ఇప్పుడు ఇలా ఎందుకు చెపుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇకపోతే ఇటీవలే మరో బాలీవుడ్ కపుల్ హృతిక్ రోషన్-సుస్సాన్నే ఖాన్ విడిపోవడం, ఆ తర్వాత తన భర్త చాలా మంచివాడంటూ ఆమె కితాబివ్వడం తెలిసిందే. తన మాజీ భార్య కోసం హృతిక్ తన ఇంటి పక్కనే మరో ప్లాటు కొనివ్వడమూ తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్-రేణూ దేశాయ్ సంగతి గురించి వేరే చెప్పక్కర్లేదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments