Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్మురేపుతున్న మణికర్ణిక.. డైరక్టర్‌గా కంగనా పేరు (ట్రైలర్)

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:10 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మణికర్ణిక'. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 7 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగన నటించింది. 
 
టీజర్‌తోనే ఇండస్ట్రీని అలర్ట్ చేసిన మణికర్ణిక మూవీ… ట్రైలర్‌తో టాక్ ఆఫ్ బాలీవుడ్‌గా మారింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం సహా దేశమంతటా మొత్తం 4 వేల స్క్రీన్స్‌పై భారీగా స్థాయిలో విడుదలకానుంది. జనవరి 25వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
బ్రిటీష్ సైన్యంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రీకరించారు. ఝాన్సీ రాణిగా కంగన రనౌత్ యాక్షన్ అదుర్స్ అనేలా ఉంది. ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ.. తాను బ్రూస్ లీ తర్వాత కంగనా కళ్లలోనే అంత రౌద్రం చూశానని .. ఆమె కళ్లనుంచి చూపు తిప్పుకోనంత బాగా చేసిందని ట్వీట్ చేశాడు.
 
ఇదిలావుంటే, మణికర్ణిక ట్రైలర్ టైటిల్స్‌లో డైరెక్టర్‌గా జాగర్లమూడి రాధాకృష్ణతోపాటు కంగన రనౌత్ పేరు కూడా చేరింది. టీజర్‌లో క్రిష్ పేరు మాత్రమే ఉండేది. మూవీ నుంచి క్రిష్ తప్పుకోవడంపై కంగన స్పందించింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం క్రిష్ మణికర్ణిక నుంచి తప్పుకున్నాడని చెప్పింది. క్రిష్‌తో తనకు విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments