Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణికర్ణికగా కంగనా రనౌత్.. అక్టోబర్ 2న టీజర్ వచ్చేస్తోంది..

బాలీవుడ్ సుందరి కంగనా రనౌత్ ''మణికర్ణిక'' ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సోనూసూద్ తప్పుకున్నాడు. దర్శకుడు క్

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (12:04 IST)
బాలీవుడ్ సుందరి కంగనా రనౌత్ ''మణికర్ణిక'' ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సోనూసూద్ తప్పుకున్నాడు. దర్శకుడు క్రిష్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈ సినిమాను వదులుకున్నాడు. ఈ నేపథ్యంలో కంగనా దర్శకత్వం వహించే ఈ సినిమా కోసం మరింత బడ్జెట్‌ను పెట్టేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. 
 
క్రిష్ చిన్న చిన్న మార్పుల కోసం ప్రాజెక్ట్‌ను కంగనాకు అప్పగించారు. కొన్ని కమర్షియల్ సాంగ్స్‌ను కూడా ఇందులో జొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సినిమా షూట్ ఆలస్యమైనా పర్వాలేదని నిర్మాతల నుంచి సిగ్నల్స్ రావడంతో.. భారీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కంగనా నిమగ్నమై ఉందట. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన టీజర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. శంకర్.. ఎహసాన్.. లాయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.     
 
కాగా ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్రగా 'మణికర్ణిక' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా నుంచి వరుసగా పోస్టర్స్ వదులుతున్నారు. దర్శకత్వ బాధ్యతలు కంగనా రనౌత్ స్వీకరించడంతో, ఈ ప్రాజెక్టుపై మరింతగా ఆసక్తి పెరిగింది. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అలాంటిది అక్టోబర్ 2న  ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments