Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు రాజీనామాను ఆమోదించం : మంచు విష్ణు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (20:48 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ('మా')కు జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు మ‌ద్ద‌తు తెలిపిన మెగాబ్రదర్ నాగ‌బాబు మా ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. 
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో కొన‌సాగ‌డం ఇష్టం లేద‌ని ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు అన్నారు. నాగ‌బాబు నిర్ణ‌యం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగ‌బాబు ఆవేశంతో ‘మా’ ప్రాథ‌మిక స‌భ్య‌త్వ‌ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఆయ‌న రాజీనామాను ఆమోదించ‌మ‌ని స్పష్టం చేశారు. 
 
అలాగే, మా అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకారం చేసే అంశంపై మంగళవారం స్ప‌ష్ట‌త ఇస్తానన్నారు. భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని న‌డుచుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ‘మా’ ఎన్నిక‌ల్లో ద‌క్కిన విజ‌యం అంద‌రిద‌ని న‌టుడు మోహ‌న్ బాబు అన్నారు. 
 
ఓటు ఎటు వేసినా ఇది అంద‌రి విజ‌యంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. సింహం నాలుగు అడుగులు వెన‌క్కి వేసిందంటే భ‌య‌ప‌డి కాదు. గురి చూసి పంజా విసురుతుంది. అన్నీ న‌వ్వుతో స్వీక‌రించాలి. నేను అస‌మ‌ర్థుడిని కాదు. న‌న్ను రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నారు. చెప్పాల్సిన స‌మ‌యంలో స‌మాధానాలు చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments