Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు పెద్ద మనసు.. భారీ వర్షాల బాధితులకు సహాయం...

హీరో మంచు విష్ణు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విష్ణు అండ్ టీం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (17:41 IST)
హీరో మంచు విష్ణు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విష్ణు అండ్ టీం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 
 
హైదరాబాద్‌లోని విష్ణు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ క్యాంపస్‌లోని 20 పైగా బ్రాంచీల వారి సహకారంతో బాధిత ప్రాంత ప్రజలకు ఆహారం, నీరు, బ్లాంకెట్స్ అందచేస్తున్నారు. అలాగే ఈ క్యాంపస్‌కు చెందిన 20 పైగా బ్రాంచీల్లో జనరేటర్స్ సహాయంతో స్పెషల్ చార్జింగ్ పాయింట్స్‌ను అరేంజ్ చేశారు. దీని ద్వారా మొబైల్స్, మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 
 
ఎవరైనా సహాయం కావాలనుకుంటే నిజాంపేట, కె.పి.హెచ్.బి కాలనీ, నాచారం, మియాపూర్‌లోని స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలను సంప్రదించాలి. శనివారం మొదలు మూడు రోజుల వరకు ప్రజలకు విష్ణు అండ్ టీం సపోర్ట్ అందిస్తారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవలో భాగమైన విష్ణు ప్రస్తుతం లక్కున్నోడు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాలకు వరదమయమైన హైదరాబాద్‌లో సాధారణ పరిస్థితలు నెలకొనాలని కోరుకుందాం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments