Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిజంపై మంచు మ‌నోజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:28 IST)
Sabita, Manchu Manoj, Srinivas Goud, MD Manohar
రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి పై చర్చించారు. ప్రముఖ నటుడు శ్రీ మంచు మనోజ్ కుమార్ అడ్వెంచర్స్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు పై  రూపొందించిన పలు ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతగిరి లో ఏర్పాటు చేయబోతున్న అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు హైదరాబాద్, తెలంగాణ  రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని టూరిజం అధికారులను ఆదేశించారు 
 
మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్.క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేయాలని మంత్రులు టూరిజం MD మనోహర్ గారిని ఆదేశించారు. అనంతగిరి హిల్స్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు మంత్రులు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం వుంద‌ని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments