Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (12:43 IST)
డాక్టర్ మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలను పోషించిన చిత్రం 'కన్నప్ప'. అయితే, మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ నటించిన 'భైరవం' చిత్రం. ఈ అన్నదమ్ములు వెండితెరపై పోటీపడుతున్నారు. 'కన్నప్ప' మూవీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ఉన్న విషయం తెల్సిందే. 
 
అలాగే, మంచు మనోజ్ కూడా తన ప్రాజెక్టును 'భైరవం' ఎంతో కీలకంగా భావించారు. ఈ రెండు చిత్రాలు వచ్చే నెలలో విడుదల చేస్తానని తాజాగా ప్రకటించారు. వెండితెరపైనే తేల్చుకుందామని అన్నకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్న డ్రీం ప్రాజెక్టు కన్నప్పకు పోటీగా తన సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు. దీంతో మంచు ఫ్యామిలీ గొడవ మరోసారి చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, కొంతకాలంగా అన్నదమ్ములు మౌనంగా ఉండటంతో గొడవ సమసిపోయిందని అంతా అనుకున్నారు. ఇటీవల మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టడంతో మంచు కుటుంబం కలిసిపోతుందని అభిమానులు ఆశించారు. అయితే, మంచు కుటుంబ వివాదానికి సంబంధించిన వేడి ఇపుడు వెండితెరకు తాకింది. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు పోటీగా సినిమాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments