Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులు గొప్పింటివాళ్లు అయితే ఎన్‌కౌంటర్ చేస్తారా? : మంచు లక్ష్మీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (16:51 IST)
దిశ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్ నగర పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సినీ నటి మంచు లక్ష్మీ స్పందించింది. ముఖ్యంగా, నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారన్న వార్త తెలియదానే ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం, టపాకాయలు పేల్చడం చూస్తే ఈ సమాజం ఎక్కడిపోతుందనే భయం నెలకొందన్నారు. 
 
ఎందుకంటే.. మనం ఒక చట్ట పరిధిలో ఉన్నామన్నారు. ఆ చట్టాలపై మనకు అపారమైన గౌరవమర్యాలు ఉన్నాయన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే ఆ చట్టాల ద్వారానే పరిష్కారం కనుగొంటున్నామన్నారు. కానీ, ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరు, తాను కూడా స్వాగతించామన్నారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. రేపు జరగపోయే పరిస్థితిని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదన్నారు. నిజానికి దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ ఈ జన్మకు తీరనిదన్నారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైగ, ఇలాంటి కేసుల్లో నిందితులు గొప్పింటివాళ్లు ఉన్నట్టయితే ఎన్‌కౌంటర్లు చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments