Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూప్ రూబెన్స్ చేసిన మనం మ్యూజికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

డీవీ
గురువారం, 23 మే 2024 (16:09 IST)
Anup Rubens
జై, ప్రేమ కావాలి, మనం వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చారు అనూప్ రూబెన్స్. ప్రేమ పాటలకు అనూప్ పెట్టింది పేరు. ఇష్క్, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా ఇలా చెప్పుకుంటూ పోతే అనూప్ రూబెన్స్ లిస్ట్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు అనూప్ రూబెన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నారు.
 
మామూలుగా సినిమా సక్సెస్‌‌లో మ్యూజిక్‌కు ఉండే ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమ కావాలి, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, టెంపర్, మనం, గోపాల గోపాల, సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నేనే రాజు నేనేమంత్రి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, హార్ట్ ఎటాక్ ఇలా ప్రతీ సినిమాలో అనూప్ రూబెన్స్ సంగీతం ఎంతో ప్రధానంగా నిలిచింది. ఆయన మెలోడీ పాటలకు ఎంతో ఫేమస్. అనూప్ ఇచ్చిన లవ్, ఎమోషనల్, మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ఇక ఎవర్ గ్రీన్ మనం మూవీ వచ్చి పదేళ్లు అయింది. ఈ క్రమంలో సినిమాను రీ రిలీజ్ కూడా చేస్తున్నారు. 
 
అనూప్ రూబెన్స్ పాటలకు థియేటర్లు మళ్లీ మోత మోగనున్నాయి. నేడు ఈ మూవీని హైద్రాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో రీ రిలీజ్ చేస్తున్నారు. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి.
 
అనూప్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ, ఆకాష్ పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

Vijayashanti: పుష్ప-2 తొక్కిసలాట.. రాజకీయం చేయొద్దు.. విజయశాంతి

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments