Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఎదుర్కోవాలంటే ముగ్గురు ముసుగు దొంగలు సరిపోరు.. నేను చాలా స్ట్రాంగ్: మల్లికా షెరావత్

ప్ర‌ముఖ బాలీవుడ్ భామ మ‌ల్లికా షెరావ‌త్‌పై గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు దాడి చేశారు. ప్యారిస్‌లోని తన ఫ్లాటుకు వెళ్తుండగా ముఖానికి ముసుగు ధ‌రించిన ముగ్గురు వ్యక్తులు హ‌ఠాత్తుగా ఆమెపై టియ‌ర్ గ్యాస

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (13:35 IST)
ప్ర‌ముఖ బాలీవుడ్ భామ మ‌ల్లికా షెరావ‌త్‌పై గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు దాడి చేశారు. ప్యారిస్‌లోని తన ఫ్లాటుకు వెళ్తుండగా ముఖానికి ముసుగు ధ‌రించిన ముగ్గురు వ్యక్తులు హ‌ఠాత్తుగా ఆమెపై టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించి మ‌ల్లికాతో పాటు మ‌రో వ్య‌క్తిపై దాడి చేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఈ ఘటనపై మల్లికా షెరావత్ స్పందించింది. తనను ఎదుర్కోవాలంటే ముగ్గురు దొంగలు కావాలంటోంది.  
 
తనపై దాడికి ముసుగు దొంగలు సరిపోరని.. తాను చాలా స్ట్రాంగ్‌ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా మల్లికా షెరావత్ వెల్లడిస్తూ ఫోటో పోస్ట్ చేసింది. మల్లిక ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి పారిస్‌లో ఉంటోంది. మల్లికా షెరావత్‌పై జరిగిన దాడికి ఆమె ప్రతిఘటించిందని తెలుస్తోంది. మల్లిక చేసిన పోస్ట్‌ ప్రకారం చూస్తే ముసుగు దొంగల దాడిని ఎదుర్కొని వారిపై ప్రతిదాడి చేసినట్లు తెలుస్తోందని విదేశీ మీడియా చెప్తోంది. 
 
కొద్ది రోజుల క్రితమే హాలీవుడ్‌ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌ను ఇద్దరు దొంగుల గన్‌తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు కిమ్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉంటున్న మల్లికపై ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారానికి 90 గంటల పని చేయాలా? సన్‌డేను - సన్-డ్యూటీగా మార్చాలా?

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments