Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది.. 40 ఏళ్లలో మేనత్త అయ్యింది.. ఫోటో వైరల్..

డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది. ఇదేంటి? ఆంటీ అయ్యిందా? సినిమాల్లో ఏదైనా ఆంటీ రోల్‌లో కనిపించనుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:24 IST)
డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది. ఇదేంటి? ఆంటీ అయ్యిందా? సినిమాల్లో ఏదైనా ఆంటీ రోల్‌లో కనిపించనుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదూ.. అక్కడే ట్విస్ట్. 40 ఏళ్ల మల్లికా షెరావత్‌కు మేనల్లుడు పుట్టాడు. అందుకే ఆమె ఆంటీ అయ్యింది. తన మేనల్లుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. 
 
ప్రస్తుతం సదరు ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతున్నదని మల్లిక వెల్లడించింది. 'నాకు మేనల్లుడు పుట్టాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను మేనత్తను అయ్యాను'అని ట్విట్టర్‌లో మల్లికా షెరావత్ వెల్లడించింది. ఈ ట్వీట్‌కు లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
2015 డర్టీ పాలిటిక్స్‌తో భారత్‌లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ప్యారిస్ వెళ్ళిన మల్లికా షెరావత్ ఇటీవల అమెరికన్ కమేడియన్, నటీమణి, రచయిత, యాంకర్, నిర్మాత అయిన చెల్సియాతో స్క్రీన్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా చెల్సియా యాంకర్‌గా ప్రాతినిధ్యం వహించిన ఓ కార్యక్రమంలో మల్లికా షెరావత్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూను కూడా మల్లికా షెరావత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం