Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ భావనపై అత్యాచారం నిజమేనా.. పోలీసులేమంటున్నారు?

పాత కక్షల కారణంగానే సినీ నటి భావనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఆమె కారు పాత డ్రైవరేనని తేలింది.

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (08:19 IST)
పాత కక్షల కారణంగానే సినీ నటి భావనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఆమె కారు పాత డ్రైవరేనని తేలింది. 
 
పలు తెలుగు చిత్రాలతో పాటు.. కన్నడ, కేరళ, తమిళ చిత్రాల్లో నటించిన నటి భావన. ఈమెను ఇటీవల త్రిశూర్ వద్ద కొందరు దుండగులు కిడ్నాప్ చేసి గంటన్నర పాటు కారులో తిప్పుతూ అత్యాచారం జరిపినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ అత్యాచార కేసులో మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించారు. గతంలో విభేదాలు వచ్చి ఆమె తీసేసిన డ్రైవర్ సునీల్ కుమార్, పాత పగను దృష్టిలో ఉంచుకుని, రెండు నెలల క్రితమే కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆమె త్రిశూర్‌లో షూటింగ్‌లో ఉందని తెలుసుకుని ప్రస్తుత డ్రైవర్ మార్టిన్‌‌తో కలసి ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారని తెలిపారు. 
 
శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆమె కారులో వెళుతుండగా, టెంపోలో నిందితులు ఫాలో అయ్యారని, నెడుంబాసరే విమానాశ్రయం సమీపంలో ఆమె కారును ఢీకొట్టి కిడ్నాప్ చేశారని వెల్లడించారు. ఆపై దాదాపు గంటన్నర పాటు ఆమెను బలాత్కరించారని చెప్పారు. 
 
దీనిపై ఫిర్యాదు అందుకుని ఎర్నాకులం మెడికల్ కాలేజీలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని, అయితే, ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది వైద్య నివేదిక వచ్చాకే వెల్లడిస్తామన్నారు. కాగా, కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్‌కు నేర చరిత్ర ఉందని, పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?

పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఇది ప్రారంభమైతే విజయవాడకు రానక్కర్లేదు..

ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments