Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మలయాళ నటికి వేధింపులు

మలయాళ నటి సనూష రైలులో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీంతో ఆ పోకిరీలను ఆమె అరెస్టు చేయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నటించిన 'బంగారం' చిత్రంలో హీరోయిన్ మీరా చోప్రా చెల్లెలి ప

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (08:54 IST)
మలయాళ నటి సనూష రైలులో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీంతో ఆ పోకిరీలను ఆమె అరెస్టు చేయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నటించిన 'బంగారం' చిత్రంలో హీరోయిన్ మీరా చోప్రా చెల్లెలి పాత్రలో సనూష నటించింది. అలాగే, ఆమధ్య వచ్చిన 'జీనియస్' సినిమాలో హీరోయిన్‌‌గా కూడా నటించింది. ఈమె తాజాగా లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీనిపై ఆమె స్పందిస్తూ, 
 
'నేను ట్రైన్‌లో చెన్నై నుంచి కేరళ వెళ్తున్న క్రమంలో బెర్త్‌పై పడుకున్నాను. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గుర్తించాను. వెంటనే అతని చేయిపట్టుకుని లైట్స్ ఆన్ చేసి ట్రైన్‌లో ఎస్కార్ట్ పోలీసులకు అప్పగించాను. అయితే నాతో అతను అసభ్యకరంగా ప్రవర్తించిన దాని కంటే కూడా పక్కనున్న మరో ఇద్దరు ఏమాత్రం రియాక్ట్ కాకపోవడం చాలా ఆందోళనకు గురిచేసింది. 
 
పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లే వరకు నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఇప్పుడు నేను చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుందని తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం పూర్తి మద్దతునిచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మహిళలకు, అమ్మాయిలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇటువంటి విషయాలు ఏవైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయవద్దు' అని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం