Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం - నటి రెంజూష మీనన్ బలవన్మరణం

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:15 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. నటి రెంజూష మీనన్ (35) ఆత్మహత్యకు పాల్పడింది. టీవీ సీరియల్స్‌తో పాటు.. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకునివుంటారని సన్నిహుతులు, సహచరులు అంటున్నారు. 
 
తిరువనంతపురంలోని ఓ బహుళ అంతస్తు భవనంలో తన భర్తతో కలిసి ఉండే  రెంజూష మీనన్... ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 
 
అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. సన్నిహితులు మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని వుంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు, రెంజూష మీనన్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇదిలావుంటే, కొచ్చిన్‌కు చెందిన రెంజూష మీనన్.. బుల్లితెర యాంకర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత స్త్రీ, నిజలాట్టం, మగలుడే అమ్మ, బాలామణి వంటి అనేక సీరియల్స్‌తో పాటు సిటీ ఆప్ గాడ్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా తాను ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్టు ఓ రీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆమె ఎంతో యాక్టివ్‌గా కనిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments