టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకి అరుదైన గౌరవం.. అదేంటంటే?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:08 IST)
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి మరో అరుదైన అవకాశం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందించింది. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 25న మహేశ్ స్వయంగా హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్ వేదికగా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత విగ్రహాన్ని సింగపూర్‌కి తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. 
 
టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ఒక విగ్రహాన్ని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మహేశ్‌కి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా పూజా హెగ్దే ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భరత్ అనే నేను చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో మహర్షి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments