Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధాపురం కోసం నమ్రత రూ.30లక్షలు.. నాకోసం ఖలేజా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై ఆయన సతీమణి, నటీమణి నమ్రత పొగడ్తల వర్షం కురిపించింది. అందాల హీరో మహేష్ బాబును పెళ్లాడిన నమ్రత, పెళ్లికి తర్వాత కెరీర్‌ను పక్కనబెట్టేసింది. మంచి గృహిణిగా, భార్యగా, అమ్మగా

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (13:59 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై ఆయన సతీమణి, నటీమణి నమ్రత పొగడ్తల వర్షం కురిపించింది. అందాల హీరో మహేష్ బాబును పెళ్లాడిన నమ్రత, పెళ్లికి తర్వాత కెరీర్‌ను పక్కనబెట్టేసింది. మంచి గృహిణిగా, భార్యగా, అమ్మగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తాజాగా నమ్రత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్తపై ప్రశంసల జల్లు కురిపించింది. తన కుటుంబం కోసం మహేష్ ఏమైనా చేస్తాడని, తన తల్లిదండ్రులంటే మహేష్‌కు అమితమైన ప్రేమ అంటూ చెప్పుకొచ్చింది. మహేష్‌లో గొప్ప కుమారుడు, గొప్ప తండ్రి అనే రెండు కోణాలను చూడొచ్చనన్నారు. 
 
గౌతమ్ పుట్టిన కొన్నాళ్లకు తన తల్లిదండ్రులు మరణించగా, ఆ సమయంలో ఖలేజా సినిమా షూటింగ్‌ను కొన్ని రోజుల పాటు క్యాన్సిల్ చేసుకుని.. తన వెంట ఉన్నాడని నమ్రత చెప్పుకొచ్చారు. మహేష్ మంచి నటుడు.. అంతకుమించి మంచి మనస్సున్న వాడని నమ్రత తెలిపారు. ముఖ్యంగా మహేష్ బాబు అంటే తనకు అమితమైన ప్రేమ.. అతడు తనకు పరిచయం కావడమే తన అదృష్టమని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు పరిచయం కావడమే తన జీవితంలో మరిచిపోని ఘటన అని ప్రిన్స్ సతీమణి తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. శ్రీమంతుడు సినిమాకు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటున్నారు. ఈ గ్రామాల అభివృద్ధి కోసం మహేష్ దంపతులు పాటుపడుతున్నారు. తాజాగా నమ్రత రూ.30 లక్షలను నాట్కో ట్రస్టు ద్వారా సిద్ధాపురంలో అభివృద్ధి పనుల కోసం అందజేసారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెక్‌ను అందజేశారు. ఈ మొత్తంతో  సిద్ధాపురంలో పాఠశాల నిర్మితం కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments