Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకొచ్చిన గొడవ.. ''మా''తో ఎందుకు? హ్యాండిచ్చిన మహేష్ బాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చారు. నిజానికి వచ్చే నెలలో అమెరికాలో మహేష్ బాబుతో ఈవెంట్ చేయించాలని మా భావించింది. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శి నరేష్ నమ్రతతో

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (11:28 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చారు. నిజానికి వచ్చే నెలలో అమెరికాలో మహేష్ బాబుతో ఈవెంట్ చేయించాలని మా భావించింది. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శి నరేష్ నమ్రతతో మాట్లాడి ఫైనల్ చేస్తే శివాజీరాజా వర్గం డైరెక్ట్‌గా ఆమెతో డీల్ చేశారని ఇటీవలి ప్రెస్‌మీట్‌లో నరేష్ తెలిపారు.
 
మహేష్ ఈ ప్రోగ్రాం చేస్తే 'మా'కి కోటి రూపాయలు నిధులు వచ్చే అవకాశం ఉంది. కానీ మా నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను రావడంతో ప్రస్తుతం మహేష్ బాబు 'మా' అసోసియేషన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇటువంటి పరిస్థితుల్లో షో చేయడం కరెక్ట్ కాదని భావించి క్యాన్సిల్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.  
 
కాగా మాలో వున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అధ్యక్షుడు శివాజీరాజా. మా అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిధుల కోసం అమెరికాలో చిరంజీవితో నిర్వహించిన కార్యక్రమంలో కొంత డబ్బుని మిస్ యూజ్ చేశారని, ఈ విషయంలో శివాజీరాజాకి 'మా'లో మరికొంతమంది మెంబర్స్ సహాయం చేశారని టాక్ వస్తోంది. 
 
ఈ విషయంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు తెలుసుకోవాలని ప్రధాన కార్యదర్శి నరేష్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా చల్లారలేదు. ఇలాంటి సమయంలో తాను ప్రోగ్రామ్ చేస్తే మరో వివాదం వచ్చి పడుతుందేమోనని భావించిన మహేష్.. తన ప్రోగ్రామ్‌ను రద్దు చేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments