Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి - మహేశ్ బాబు చిత్రం బడ్జెట్ రూ.1000 కోట్లా? తమ్మారెడ్డి ఏమంటున్నారు...

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (15:17 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుల కాంబినేషన్‌లో రూపొందున్న ఎస్ఎస్ఎంబీ29 చిత్రం బడ్జెట్ రూ.1000 కోట్లు దాటొచ్చని హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ అంశంపై స్పందించారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుందని, తెలుగు సినిమా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటవచ్చని భరద్వాజ అంచనా వేశారు. 
 
'బాహుబలి' సినిమా విడుదలయ్యాక తెలుగు సినిమా స్థాయి పెరిగిందని, రూ.100 కోట్ల సినిమా అంటే సర్వసాధారణ అంశంలా మారిపోయిందన్నారు. ఇక ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన "ఆర్ఆర్ఆర్" తర్వాత రూ.300 కోట్లు చిన్న బడ్జెట్‌గా కనిపిస్తోందని, ప్రస్తుతం మహేశ్ సినిమా వచ్చాక రూ.500 కోట్లు సాధారణ విషయంలా అనిపిస్తోందని చెప్పారు.
 
ఇకపోతే, ఈ సినిమా కనీసం రూ.2 వేల కోట్ల బిజినెస్ జరుపుతుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. వసూళ్లు రూ.3-4 వేల కోట్ల వరకు రావొచ్చని అన్నారు. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి నటులు నటిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తును రాజమౌళి చాలా బాగా ఊహిస్తారని, 'ఎస్ఎస్ఎంబ29' ద్వారా మరోసారి ఆయన సత్తా చాటనున్నారని అన్నారు. 
 
ఈ ప్రాజెక్ట్ బిజినెస్ ఊహించడం కూడా కష్టమన్నారు. రూ.3-4 వేల కోట్ల వసూలు చేస్తే భారతదేశ సినీరంగంలోనే చరిత్ర అవుతుందని భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 'ఎస్ఎస్ఎంబీ 29' తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నానని ఆయన అభిలషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments