Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే చిత్రం కథ ఇదేనా?

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (18:28 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న‌ చిత్రంలో కొంత భాగం 18వ శతాబ్దంతో సెట్ చేయబడిన పిరియాడిక్ డ్రామాగా ఉంటుందని తెలుస్తొంది. ఇందులో 200కు పైగా విభిన్న రూపాలతో కూడిన పాత్రలు కనిపిస్తాయని, ప్రత్యేక గిరిజన తెగలకు చెందినవిగా అవి ఉంటాయని సమాచారం. దీనికోసం అప్పటి మానవుల రూపాల స్కెచ్‌లను సిద్ధం చేయిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వాటిని ఖరారు చేయనున్నారు. 
 
హీరో మహేశ్ బాబు సైతం ఈ సినిమా కోసం మల్టీపుల్ లుక్స్‌లో కనిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం‌ రాజమౌళి మహేశ్ లుక్స్‌ను ఎంపిక చేసె పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం అటు ఫిలిం సిటీ‌లో‌ ఇటు అల్యూమినియం ప్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. తదుపరి వర్క్ షాప్‌ల నిర్వహణ ఉంది. ఇలా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కోసం కావలసినంత సమయాన్ని కేటాయించాలని టీమ్ భావించిన తరుణంలో 2025లోనే ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం‌కావచ్చని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments