Webdunia - Bharat's app for daily news and videos

Install App

185 కేంద్రాల్లో సూపర్‌స్టార్‌ మహేష్‌ 'శ్రీమంతుడు' 50 రోజులు పూర్తి...

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (16:46 IST)
6 వారాల్లోనే 100 కోట్లకు పైగా షేర్‌ సాధించి టాలీవుడ్‌లో సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలబడ్డ సూపర్‌ సెన్సేషనల్‌ హిట్‌ 'శ్రీమంతుడు' సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీమంతుడు' సెప్టెంబర్‌ 25కు 185 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం పూర్తిచేసుకొని సూపర్‌ కలెక్షన్స్‌లో శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.
 
ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ - ''కొరటాల శివగారు చెప్పిన కథ వినగానే ఎగ్జైట్‌ అయి ఓ మంచి సినిమా చేస్తున్నానన్న ఫీలింగ్‌తో కథని నమ్మి చేసిన సినిమా 'శ్రీమంతుడు'. ఓ మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు, అభిమానులు ఎంత గొప్పగా ఆదరిస్తారో 'శ్రీమంతుడు' సినిమా ద్వారా నాకు తెలిసింది. నా కెరీర్‌లో అన్ని విధాలా నాకు సంతృప్తిని కలిగించిన సినిమా 'శ్రీమంతుడు'. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది 'శ్రీమంతుడు' ఘన విజయం'' అన్నారు.
 
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ - ''ఓ మంచి కథకు, మహేష్‌ బాబుగారి లాంటి సూపర్‌స్టార్‌ తోడయితే సక్సెస్‌ ఎంత పెద్ద రేంజ్‌లో వుంటుందన్న దానికి నిదర్శనంగా 'శ్రీమంతుడు' నిలబడినందుకు చాలా ఆనందంగా వుంది. 'శ్రీమంతుడు'ని ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియన్స్‌కు, సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ బాబుగార్ల అభిమానులకు థాంక్స్‌'' అన్నారు.
 
నిర్మాతలు నవీన్‌, రవి, సివిఎం మాట్లాడుతూ - ''మా మైత్రి మూవీ మేకర్స్‌ తొలి చిత్రమే ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్‌ అవడం.. 100 కోట్ల షేర్‌ దాటడం, 185 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం అంతా మాకు ఓ పెద్ద పండగలా వుంది. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌గారికి, కొరటాల శివగారికి మా కృతజ్ఞతలు'' అన్నారు. 
 
జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, శృతిహాసన్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన  తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరా: మది, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌,  థ్రిల్స్‌: అనల్‌ అరసు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, మేకప్‌: పట్టాభి, కాస్ట్యూమ్స్‌: రాజు, స్టిల్స్‌: దాసు,  అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌  డైరెక్టర్స్‌: శేషు, జయరాం, రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: కొరటాల శివ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments