Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భరత్ అనే నేను"కు లైన్ క్లియ‌ర్.. ఎలా?

సూపర్‌స్టార్ మహేష్ బాబు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం "భ‌ర‌త్ అనే నేను". ఈ సినిమాని ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే... 'భరత్ అనే నేను' విడుదలైన వారాని

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:22 IST)
సూపర్‌స్టార్ మహేష్ బాబు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం "భ‌ర‌త్ అనే నేను". ఈ సినిమాని ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే... 'భరత్ అనే నేను' విడుదలైన వారానికే అంటే ఏప్రిల్ 27వ తేదీన రజనీకాంత్ నటించిన "కాలా" చిత్రం విడుదల కానుంది వార్త‌లు వ‌చ్చాయి. దీంతో మహేష్ బాబు అభిమానులకు కాస్త నిరాశను కలిగిస్తూ వస్తుంది.
 
అయితే తాజా సమాచారం ప్రకారం... రజ‌నీకాంత్ "కాలా" చిత్రం ఏప్రిల్ 27వ తేదీన విడుదలవడం లేదని తెలుస్తుంది. రంజిత్ పా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్ర విడుదల జూన్‌కి వాయిదావేసినట్టు సమాచారం. 
 
కావేరీ జలాలపై తమిళనాట జరుగుతున్న నిరసన కారణంగా 'కాలా' చిత్రాన్ని వాయిదా వేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎటువంటి పోటీ లేకుండా వచ్చిన "రంగస్థలం" బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నట్లుగానే.. మే 4వ తేదీన అల్లు అర్జున్ వచ్చే వరకు మరో సినిమా లేకపోవడంతో.. 'భరత్ అనే నేను' బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేయడానికి ఈ గ్యాప్ చాలంటూ మహేష్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments