Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట డైరెక్టర్ స్టార్ట్ చేసేసాడుగా..!

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:44 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు వెయిటింగ్. కరోనా రావడంతో షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ.. లేకపోతే ఈపాటికే సర్కారు వారి పాట సెట్స్ పైకి వెళ్లేది.
 
అయితే.. ఈ సినిమాలో సగభాగం అమెరికాలో షూట్ చేయాలి కానీ.. కరోనా కారణంగా అమెరికాలో కాకుండా ఆ పార్ట్ కూడా ఇండియాలోనే ప్లాన్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. దర్శకుడు పరశురామ్ మాత్రం అమెరికాలో షూట్ చేయాల్సిందే అని పట్టుబట్టాడట. అందుకనే అమెరికాలోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 
 
దర్శకుడు పరశురామ్, డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్ కలిసి యూఎస్ఏలో లొకేషన్స్ చూడడానికి వెళ్లారు. ఈ సినిమా కథ ప్రకారం సినిమా అమెరికా నేపథ్యంలో కూడా జరుగుతుందట. సుమారు 50 శాతం చిత్రీకరణ అక్కడే ఉంటుందని సమాచారం. ముందుగా అమెరికా షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేయాలనుకుంటున్నారట.
 
జనవరి నెలాఖరుకి అమెరికా షెడ్యూల్ ముగించాలనేది టీమ్ ప్లాన్. ఇందులో మహేష్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని... అభిమానులకు అయితే ఈ సినిమా పండగ అనేలా ఉంటుందని దర్శకుడు పరశురామ్ చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.
 
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మరి.. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments