Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌లో ప్రిన్స్ స్టెప్పులు.. ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి మహేష్ బాబు ఎంటరైతే?

జనతా గ్యారేజ్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్టెప్పులేస్తున్నాడా? కొరటాల శివ కోసం స్పెషల్ సాంగ్ చేశాడా? ఎన్టీఆర్ సినిమా ప్రిన్స్ స్టెప్పులేసేందుకు ఒప్పుకున్నాడా? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాలం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (18:58 IST)
జనతా గ్యారేజ్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్టెప్పులేస్తున్నాడా? కొరటాల శివ కోసం స్పెషల్ సాంగ్ చేశాడా? ఎన్టీఆర్ సినిమా ప్రిన్స్ స్టెప్పులేసేందుకు ఒప్పుకున్నాడా? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఈ కథనం చదవాల్సింది. ఇంతకీ విషయం ఏమిటంటే..? జనతా గ్యారేజ్ కోసం వేసిన సెట్‌లో మహేష్ బాబు స్టెప్పులేస్తున్నాడు. 
 
అవునండీ.. కొరటాల శివ, జనతా గ్యారేజ్ సినిమా కోసం సారధి స్టూడియోస్‌లో భారీగా గ్యారేజ్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సెట్‌ను మహేష్ కోసం.. మురుగదాస్ ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పటికే మురుగదాస్-ప్రిన్స్ సినిమాకు చెందిన ఓ షెడ్యూల్‌ చెన్నైలో పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
 
ఈ షూటింగ్‌లో భాగంగా.. ఎన్టీఆర్ కోసం వేసిన సెట్‌లోనే కొన్ని మార్పులు చేసిన మురుగదాస్.. అదే సెట్లో మహేష్ సినిమా షూటింగ్‌కు చెందిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు. ఓ యాక్షన్ సన్నివేశంతో పాటు, ఓ పాటను కూడా ఇక్కడే చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అలా ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి మహేష్ బాబు ఎంటరయ్యాడన్నమాట..!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments