విలేజ్‌లో ''మహర్షి'' ఏం చేస్తాడో?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:39 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ''మహర్షి''. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. కాలేజీ స్టూడెంట్‌గా మహర్షిలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాదులో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని టాక్. 
 
హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా రామోజీ ఫిలిమ్ సిటీలో విలేజ్ సెట్ వేసేందుకు సినీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్. విలేజ్ సెట్ పూర్తయిన వెంటనే మహేశ్‌బాబు, పూజా హెగ్డే ఇతర నటీనటులతో కొన్ని సన్నివేశాలను గ్రామంలో షూట్ చేయనున్నామని చిత్ర బృదం వెల్లడించింది. 
 
అల్లరి నరేశ్, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments