Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగూభాయ్ సినిమాకు చిక్కు.. అది సెక్స్ వర్కర్స్ అడ్డా కాదు.. ఎమ్మెల్యే ఫైర్

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (17:44 IST)
Alia Bhatt
బాలీవుడ్‌లో సంచలన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సంజయ్ లీలా భన్సాలీ తాజాగా గంగూభాయ్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై కూడా ప్రస్తుతం వివాదం చెలరేగుతుంది. అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదలై సంచలనం రేపుతుంది. దీనికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. అలియా అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
 
అంతేకాదు ట్రిపుల్ ఆర్ యూనిట్ అంతా కూడా గంగూభాయ్ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్రలో నటిస్తుంది. ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వర్కర్‌ అయిన గంగూభాయ్ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. 
 
రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ లాంటి వరస విజయాల తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమాపై వివాదం రేగుతుంది. ఎమ్మెల్యే అమిన్ పటేల్ గంగూభాయ్ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కామాతిపురాను అవమానించేలా ఈ సినిమా ఉందంటూ ఆయన మండి పడ్డారు. ఆ ప్రాంతాన్ని జనాల్లో తక్కువ చేసి చూపిస్తున్నారని.. హేళన చేస్తున్నారని ఆరోపించారు.
 
ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు ఇప్పుడు సైంటిస్టులు అయ్యారని.. దేశం గర్వపడే స్థాయిలో ఉన్నారని చెప్పుకొచ్చాడు అమిన్. కానీ గంగూబాయ్ సినిమాలో మాత్రం ఇప్పటికీ అది సెక్స్ వర్కర్స్ అడ్డా అన్నట్లు చూపించారని ఆయన ఫైర్ అయ్యారు. వెంటనే ఆ సినిమాపై యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం