Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహానటి" మూవీ నుంచి తొలగించిన వీడియో

సీనియర్ నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. మే 9న విడుద‌లైన ఈ చిత్రం కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది. తెలుగు, త‌మిళ భాష‌

Webdunia
ఆదివారం, 27 మే 2018 (11:58 IST)
సీనియర్ నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. మే 9న విడుద‌లైన ఈ చిత్రం కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మూవీ మేక‌ర్స్.
 
ఇప్ప‌టికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌డుతున్న ఈ చిత్రం రూ.30 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టింది. యూఎస్‌లోనూ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అయితే నిడివి ఎక్కువైన కార‌ణంగా తొల‌గించిన కొన్ని సీన్స్‌ని మ‌ధ్య మ‌ధ్య‌లో యూట్యూబ్ ద్వారా విడుద‌ల చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఆనంద‌ప‌రుస్తున్నారు.
 
తాజాగా 'రావోయి మా ఇంటికి' అనే సాంగ్‌కి సంబంధించిన వీడియోని విడుద‌ల చేశారు. ఇందులో కీర్తి సురేష్ అభిన‌యం అచ్చం సావిత్రిలానే ఉండ‌టంతో ఆమెపై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినిమా నుండి తొల‌గించిన సీన్స్ అంటూ విడుద‌లైన కొన్ని క్లిప్స్ సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. మంచి సీన్ల‌ని ఎందుకు తొల‌గించారంటూ కొంద‌రు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో రూపొందింది.  

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments