Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Mahanati సర్‌ప్రైజ్‌ అదిరింది... (Video)

అందాల నటి సావిత్ర జయంతి సందర్భంగా "మహానటి" చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్ పతాకంపై సావిత్రి

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (09:23 IST)
అందాల నటి సావిత్ర జయంతి సందర్భంగా "మహానటి" చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్ పతాకంపై సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈచిత్రం టైటిల్‌ లోగోకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
 
ఈ వీడియోలో 'మాయాబజార్'లోని పేటికను చూపించారు. దాన్ని ఓ మహిళ తెరిచారు. అందులోంచి ‘మహానటి’ అనే టైటిల్‌ బయటికి వచ్చింది. ఈ సన్నివేశాన్ని పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్‌లో.. ‘అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికి కనిపిస్తుంది, మీకు పెళ్లైందా.. అయితే నన్ను చేసుకుంటారా?, అయ్యోరామ, నమో కృష్ణ, అలిగిన వేళనే చూడాలి, నన్ను వదిలి నీవు పోలేవులే, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’ అంటూ సావిత్రి సినీ కెరీర్‌కు సంబంధించిన డైలాగ్స్‌, పాటలను వినిపించారు. ఇలా చాలా ఆసక్తికరంగా ఈ వీడియోను రూపొందించారు.
 
దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌ను పోషిస్తోంది. సమంత, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు ‘మహానటి’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది 29న విడుదల చేయనున్నారు. 

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments