Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి స‌హ‌జీవ‌నం నేప‌థ్యంలో మ్యాడ్‌

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (16:33 IST)
MAD stills
మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మ్యాడ్". మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో రెండు జంటల కథతో చూపిస్తూ "మ్యాడ్" చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు లక్ష్మణ్ మేనేని. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న "మ్యాడ్" మూవీ ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ, .జీవితంలో ఎంతో ముఖ్యమైన సందర్భం వివాహం. ఇలాంటి పెళ్లి విషయంలో నేటి యువత చాలా మంది సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే ఎంత స్పీడ్ గా పెళ్లిళ్లు జరుగుతున్నాయో, అంతే స్పీడ్ గా విడిపోతున్నారు. ఈ పరిస్థితికి ఆ జంటలతో పాటు తల్లిదండ్రుల తొందరపాటు కూడా కారణమే. ఇలా పెళ్లి సహజీవనం వంటి విషయాల్లో రెండు జంటలు ఎదుర్కొన్న పరిస్థితులను ఆసక్తికరంగా "మ్యాడ్" సినిమాలో తెరకెక్కించాం. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం.. అన్నారు.
 
చిత్రానికి కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్ , పి ఆర్ ఒ : జియస్ కె మీడియా, ప్రొడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు, దర్శకుడు లక్ష్మణ్ మేనేని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments