Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి హేమ‌ అరెస్టు ..‌ 'మా' యాక్షన్ ఎప్పుడు.?

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (17:41 IST)
బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో సినీ నటి హేమను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ రేవ్ పార్టీలో తాను లేనని తొలుత హేమ బుకాయించింది. తాను హైదరాబాద్ నగరంలో ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేసింది. కానీ ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారని, అందులో హేమ‌ కూడా ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. 59 మంది పురుషుల రక్త నమూనాలను పరీక్షించగా, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌గా పరీక్షించారు. మొత్తంమీద, 103 మంది వ్యక్తులలో 86 మంది మాదకద్రవ్యాల వాడకాన్ని నిశితంగా పరీక్షించారు. ఈ కేసు విచారణ నిమిత్తం, హేమకు నోటీసులు ఇచ్చినా.. అనారోగ్య కారణాలను హేమ సాకుగా చెప్పి, విచారణకు హాజరు కాలేదు. సోమవారం బెంగుళూరు పోలీసులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగించిన కేసులో హేమను  అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం‌ హాస్పిటల్‌‍కు తరలించారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 
 
ఇక ఈ కేసులో హేమపై అరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుందని  గతంలో మా‌ అధ్యక్షుడు విష్ణు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. మరీ హేమ డ్రగ్స్ తీసుకుందన్నది నిజం.. దాన్ని ఆమెకు ఎవరిచ్చారనే దానిపైనే పోలీసులు విచారణ జరగనుంది.‌ రేవ్ పార్టీ ఆర్గనైజర్స్ ఎవరనే దానిపై కూడా క్లారిటి రావాల్సి ఉంది. మరోపక్క డ్రగ్స్‌‌ను రూపుమాపాలంటూ.. గతంలో  స్వయానా ఇప్పటి‌ మా కమిటీ పోలీసులను కలిసింది.‌ అలాంటిది మా సభ్యురాలైన హేమ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందని తెలటంతో.. మంచు విష్ణు, ఇంతకముందు తాను చెప్పినట్లుగా, హేమ చేసిన తప్పుపై యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు.‌ ఏ విధంగా తీసుకుంటారనే చర్చ మొదలైంది..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments