Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా' ఎన్నికల్లో ఓటు వేయని ప్రముఖులు.. సమంత, రకుల్ అందుకే రాలేదు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:48 IST)
మా ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కును వినియోగం చేసుకోలేదు. మా.. ఎన్నికలు ఈసారి చాలా టఫ్‌గా జరిగాయి. రెండు ప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా గురిపెట్టాయి. చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి కూడా సభ్యులను రమ్మని, ఓటేయమని ఆహ్వానించాయి. దీంతో భారీ స్థాయిలో తారలంతా తరలివచ్చారు. మా చరిత్రలోనే ఎక్కువగా పోలింగ్ నమోదై రికార్డ్ సృష్టించింది. కానీ ఇంత హడావుడిలోనూ చాలామంది స్టార్లు ఓటేయడానికి రాలేదు.
 
ఓటయడానికి రాని హీరోల లిస్టు చూస్తే.. వెంకటేశ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రవితేజ, నాగచైతన్య, నితిన్, సుమంత్, నాగశౌర్య, సునీల్ ఉన్నారు. దీంతో వీళ్లను చూడడానికి దూరాభారాలు లెక్కేయకుండా పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు పడ్డ అభిమానులకు నిరాశ తప్పలేదు.
 
ఓటేయడానికి రాని హీరోయిన్లు ఎవరంటే.. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, అనుష్క ఉన్నారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఆమె వస్తుందని చెప్పలేం. సమంత విడాకుల వ్యవహారం వల్ల రాలేకపోయిందని టాక్. మరి తమన్నా, అనుష్క సంగతేంటి? కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల, మరికొందరు షూటింగుల్లో ఉండడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments