Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోసియేషన్ డబ్బుతో నేను ఒక్క టీ కూడా తాగను: శివాజీ రాజా

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడంపై మా అధ్యక్షుడు శివాజీరాజా స్పందించింది. దీనిపై మా కార్యవర్గ సమావేశం

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:03 IST)
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడంపై  మా అధ్యక్షుడు శివాజీరాజా స్పందించింది. దీనిపై మా కార్యవర్గ సమావేశం సోమవారం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ''మా'' అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌ హాజరయ్యారు. 
 
అనంతరం శివాజీ రాజా మాట్లాడుతూ.. ''మా'' నిధులు దుర్వినియోగమయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసోసియేషన్‌లో ఐదు పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని సవాల్‌ చేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని.. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. 
 
వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో మా అసోసియేషన్‌ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసోసియేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజ్‌ ఆక్షేపించారు. అసోసియేషన్ డబ్బుతో తాను ఒక్క టీ కూడా తాగలేదని ఆయన అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను తప్పు పట్టడమే వాళ్ల పనని తెలిపారు. 
 
కాగా, ఇటీవల అమెరికాలో ''మా'' సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో దుమారం మొదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments