Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ.. హీరోలు పన్ను కట్టరా..?

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:01 IST)
మాస్టర్ సినీ హీరో, తమిళ స్టార్ హీరో విజయ్‌కి షాక్ తగిలింది. విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. అంతే కాకుండా ఆయన వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్ట్.
 
ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు తప్పనిసరిగా టాక్స్ కట్టాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి ఎం సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పేశారు. అంతే కాకుండా హీరోలు పన్ను కట్టేందుకు వెనుకాడుతున్నారు అంటూ హై కోర్ట్ సీరియస్ అయింది.
 
అలాగే పిటిషన్ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను హీరో విజయ్ కి ఏకంగా లక్ష రూపాయలు జరిమానా విధించింది. విజయ్ కట్టే జరిమానాను కరోనా రిలీఫ్ ఫండ్ కోసం వినియోగించాలని న్యాయమూర్తి తెలిపారు. కాగా గతంలో ఇంగ్లండ్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ను హీరో విజయ్ దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments