Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లలోనే లవ్ స్టోరీ.. మేకర్స్ ఫిక్స్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (20:46 IST)
ప్రముఖ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్‌స్టోరీ' సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. రిలీజ్ డేట్‌ని కూడా ఫిక్స్ చేసారని, జూలై 23న లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణ దాస్‌ నారంగ్‌ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేశ్‌ 'నారప్ప'ఓటీటీలో రాబోతుందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు. 
 
మరోవైపు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమాను మొదటగా ఏప్రిల్‌ 16న విడుదల చేయాలనుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.
 
ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో థియేటర్లు మొదలుకానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ చిత్రాన్ని కూడా జూలై నెలలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి థర్డ్ వేవ్ ప్రమాదం ఉండడంతో నిజంగానే నిర్మాత ప్రకటించిన తేదీ కి ఈ సినిమా విడుదల అవుతుందా అన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments