Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పెట్టిన షరతులన్నీ ఒప్పుకునే లవ్ గురు : విజయ్ ఆంటోనీ

డీవీ
మంగళవారం, 26 మార్చి 2024 (16:05 IST)
Vijay Antony - Mrinalini Ravi
వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లవ్ గురు". ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. "లవ్ గురు" సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా "లవ్ గురు" సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న  విడుదల చేయబోతున్నారు. ఇవాళ "లవ్ గురు" సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
 
"లవ్ గురు" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. తండ్రి పోరు పడలేక పెళ్లికి ఓకే చెప్తుంది ప్రియా అనే అమ్మాయి. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. పెళ్లి చూపుల టైమ్ లో కాబోయో భర్తకు కొన్ని కండీషన్స్ పెడుతుంది. అమ్మాయిని ఇష్టపడిన ఆ అబ్బాయి ఆమె చెప్పిన కండీషన్స్ అన్నింటికీ తలూపుతాడు. భార్యను వన్ సైడ్ గా లవ్ చేస్తాడు. షరతులన్నీ ఒప్పుకుంటాడు గానీ పెళ్లయ్యాక వాటిలో ఉన్న ఇబ్బందులు అర్థమవుతుంటాయి. పెళ్లయ్యాక ఎదురైన ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు. భార్యను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాడా లేదా అనే అంశాలతో ట్రైలర్ ఫన్, ఎంటర్ టైనింగ్ గా చూపించారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా "లవ్ గురు" సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments