Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య వినాయకుడికి ముసుగు... ఆ కాలనీవాసులు ముసుగు తీసి ఎత్తుకెళ్లబోతున్నారు...

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (18:41 IST)
తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని అన్న చందంగా తాజాగా జరిగిన సంఘటన వుంది. విషయం ఏమంటే.. బాలకృష్ణ నటిస్తున్న డిక్టేటర్‌ చిత్రం కోసం ప్రత్యేకంగా వినాయక చవితి కాన్సెప్ట్‌తో ఓ పాటను చిత్రించారు. నానక్‌రామ్‌గూడా లోని చిత్రపురి కాలనీలో ఇందుకు భారీగా స్టేజ్ కట్టారు. అయితే వర్షం కారణంగా సగమే పూర్తయింది. మిగిలిన కొంత వర్క్‌ చేయాల్సి వుంది. ఆ పాటను వినాయక చవితి నాడే.. ఆ తర్వాత చేయాలని ప్లాన్‌ చేశారు. 
 
కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారిపోయి చిత్ర యూనిట్‌... వినాయకుడి విగ్రహాన్ని.. ఒక మూలగా పెట్టేసి.. దానిపై కవర్‌ కప్పారు. వినాయకుడిని ఒక్కసారి పూజించి.. దాన్ని అలా వుంచకూడదని కాలనీవాసులంతా గొడవ చేస్తున్నారు. ఇందుకు కాలనీ కమిటీ కూడా ఓ నిర్ణయానికి వచ్చేసింది. వినాయకుడ్నిఅలా వుంచడం వల్ల తమకు చేదు అనుభవం ఎదురైందని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాలనీకి ప్రవేశ మార్గం రెండోది కూడా వుంది. దాన్ని అనుకోకుండా.. ఆ చుట్టుపక్కలే వుంటున్న కలెక్టర్‌ మూయించివేశారు. దాంతో మూడు కిలీమీటర్ల దూరంతో చుట్టూరా తిరిగి కాలనీకి రావాల్సి వుంటుంది. మంగళవారం నాడే కాలనీవాసులంతా సమావేశమై... ముసుగు వేసిన వినాయకుడి విగ్రహాన్ని వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్‌ సరైన విధంగా స్పందించకపోవడమే కారణంగా చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments