నామినేషన్ ప్రక్రియకే రెండు రోజులా..? హగ్ ఇవ్వమన్న మోనాల్..

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (12:23 IST)
Monal Gajjar
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేయడం హౌస్ మేట్స్‌తో పాటు ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. సోమవారం ఎపిసోడ్‌లో అఖిల్ మోనాల్‌కు కొంచెం దూరంగా ఉండటంతో ఆమె అఖిల్‌ను ఎందుకు దూరంగా ఉంటున్నావని ప్రశ్నించింది. 
 
అఖిల్ తానేం దూరంగా లేనని చెప్పడంతో మోనాల్ తనకు హగ్ ఇవ్వాలని అడిగింది. అఖిల్ హగ్ ఇవ్వగా తన అఖిల్ ఈ విధంగా కౌగిలించుకోడని మోనాల్ చెబుతుంది. దీంతో అఖిల్ తనకు కొంచెం టైం కావాలంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు. 
 
బిగ్ బాస్ నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్ ఇద్దరి తలలపై గుడ్లు పగలగొట్టాలని చెప్పారు. దీంతో మోనాల్ తనకు గుడ్డు కొట్టించుకోవడం ఇష్టం లేదని బిగ్ బాస్‌కు చెప్పగా బిగ్ బాస్ మోనాల్‌ను నామినేట్ చేసేవాళ్ల తలపై గుడ్డు పగలగొట్టాలని చెప్పారు. హౌస్‌లో మొదట అరియానా హారిక, సోహైల్ తలలపై గుడ్లు పగలగొట్టి ఇద్దరినీ నామినేట్ చేసింది.తనను నామినేట్ చేయడంతో సోహైల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
మార్నింగ్ పనిష్మెంట్ ఇచ్చి అది చేయలేదంటూ గలీజ్ రీజన్ చెప్పి తనను నామినేట్ చేయడం సరికాదని సోహైల్ అన్నాడు. అరియానా పుడింగిలా ఫీల్ కావడంతో పాటు యాటిట్యూడ్ చూపిస్తోందని చెప్పాడు. అవినాష్ అభిజిత్, హారికలను నామినేట్ చేశాడు. సొహైల్ మోనాల్‌ను, అభిజిత్‌ను నామినేట్ చేసి అఖిల్‌కు, తనకు మధ్య గొడవలు రావడానికి మోనాల్ కారణమని చెప్పాడు.
 
అభిజిత్ అవినాష్‌ను నామినేట్ చేయడంతో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. బిగ్ బాస్ ప్రోమోలో అఖిల్ మోనాల్‌ను నామినేట్ చేసినట్లు చూపించగా అఖిల్ నామినేషన్‌కు ఏ కారణం చెబుతాడో చూడాలి. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియకే రెండు రోజులు కేటాయించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments