Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న "కొడకా కొటేశ్వరరావు'' -నేడు గాలివాలుగా.. లిటిల్ పవన్ ఫ్యాన్స్ అదుర్స్ (వీడియో)

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' విడుదలకు సిద్ధమవుతోంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వ‌స

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (18:19 IST)
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' విడుదలకు సిద్ధమవుతోంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వ‌స్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ డేట్ డిజైన్ పేరిట ఆ సినిమా బృందం ఓ స్టిల్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దునైన ఆయుధం ప‌ట్టుకుని ఆవేశంగా దూసుకొస్తున్నట్లు సన్నివేశం వుంది. 
 
ఇక ట్రైలర్ ఎలా వుంటుందోనని పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ న‌టించారు. 
 
ఈ నేపథ్యంలో జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమాలోని పాటలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ''అజ్ఞాతవాసి''లో పవన్‌కల్యాణ్‌ "కొడకా కొటేశ్వరరావు'' అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటను పోలాండ్‌కు చెందిన ఓ చిన్నారి పాడి నిన్న షాకిచ్చాడు. 
 
ఈ పాటకు పవన్ కూడా ఫిదా అయిపోయాడు. తాజాగా అమెరికాకు చెందిన ఓ చిన్నారి ''గాలివాలుగా..'' అంటూ సాగే గీతాన్ని కీబోర్డ్ వాయిస్తూ పాడి అదుర్స్ అనిపించుకుంది. ఈ వీడియోను సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ రీట్వీట్‌ చేశారు. ''క్యూట్‌ లిటిల్‌ ఫ్యాన్‌ ఫ్రమ్‌ యూఎస్‌'' అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఉంది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments