Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగమతికి ప్రభాస్‌కి ఉన్న లింకేంటి?: బాహుబలి చెప్పగానే అనుష్క ఒప్పేసుకుందా?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (15:54 IST)
బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్-అనుష్కలు బాగా క్లోజ్ అయ్యారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. వ్యక్తిగత విషయాలతో పాటు తమ సినీ ప్రాజెక్టుల్ని కూడా ఒకరికొకరు చర్చించుకుని ఓకే చేస్తున్నారట. ప్రస్తుతం చారిత్రాత్మక చిత్రాల సీజన్ నడుస్తుండటంతో బాహుబలి, రుద్రమదేవి, కంచె వంటి సినిమాలు హిట్ కావడంతో భాగమతి సినిమా ఆఫర్ అనుష్కకు వచ్చింది. 
 
అయితే డైరక్టర్ అశోక్ కుమార్ కావడంతో పాటు రొటీన్ పాత్రలు వద్దనుకున్న అనుష్క.. ముందు భాగమతిని తిరస్కరించింది. అయితే ప్రభాస్ రంగంలోకి దిగి ఒప్పించండంతో అశోక్ కుమార్ భాగమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. రెబెల్ స్టార్ స్నేహితులు ప్రమోద్ వంశీలు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 
 
కాగా, హైదరాబాదును కట్టించిన నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమికురాలు అయిన భాగమతి అనే పాత్రలోనే నటించేందుకు అనుష్క ఓకే చెప్పేసింది. జారా స్త్రీ అయిన భాగమతి.. నవాబును పెళ్లి చేసుకున్నాక హైదర్ మహల్ అని పేరు మార్చుకుంది. అలా ఆమె పేరు మీదనే హైదరాబాద్ భాగ్యనగర్ అనే పేర్లు వచ్చాయి. ఈ రోల్ గురించి చెప్పగానే అనుష్క కూడా ఈ పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పేసింది. దానికి తోడు ప్రభాస్ కూడా సిఫార్సు చేయడంతో అశోక్ సినిమాకు బొమ్మాళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments