Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ భయంతోనే దేశం వదిలి వెళ్ళిపోయా.. రవితేజ అంటే ఇష్టం: ఇలియానా

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన ఇలియానా.. ప్రస్తుతం బిటౌన్‌లో మకాం వేసింది. అక్కడ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్ అయిన తన బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు వేస

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (15:19 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన ఇలియానా.. ప్రస్తుతం బిటౌన్‌లో మకాం వేసింది. అక్కడ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్ అయిన తన బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు వేస్తూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో వుంది ఇలియానా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో హిందీ తెలియక ఎన్నో అవస్తలు పడ్డానని చెప్పుకొచ్చింది.
 
సినిమా ప్రమోషన్లలో మీడియా ప్రతినిధులు తనను హిందీలో మాట్లాడాలని కోరేవారని.. అప్పుడు చాలా భయమేసి.. మూడు వారాల పాటు భారత్‌ను వదిలి వెళ్ళిపోయానని సినీ నటి ఇలియానా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తెలుగు, హిందీ భాషలు అస్సలు రావని.. అందుకే సెట్స్‌లో ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్నని ఇలియానా వెల్లడించింది. అయితే అభిమానులు ఇంతగా ఆదరిస్తారని మాత్రం తాను ఊహించలేదని, ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని ఇల్లీ తెలిపింది. 
 
తన తాజా చిత్రం ముబారకన్‌లో తాను పంజాబీ అమ్మాయిగా కనిపిస్తానని ఇలియానా తెలిపింది. దక్షిణాది చిత్ర రంగంలో తాను అక్షయ్ కుమార్ లాంటిదాన్నని... ఆయన మాదిరే తాను కూడా ఏడాదికి నాలుగు చిత్రాలు చేసేదాన్నని చెప్పింది. తెలుగులో అందరు అగ్ర హీరోలతో చేశానని... తనకు నచ్చిన నటుల్లో రవితేజ ఒకడని ఇలియానా చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments