Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీకైన ప్రభాస్ సాహో... తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా... "ఇట్స్ షో టైమ్"

తెలుగు చిత్ర పరిశ్రమే కాదు.. యావత్ ప్రపంచ సినిమా స్థాయి, భాషల భేదాలు లేకుండా పైరసీల బారిన పడటం పాత విషయం. ఇప్పుడు అందర్నీ బెంబేలెత్తిస్తున్న సమస్య ఒకటే - లీక్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్ప

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:48 IST)
తెలుగు చిత్ర పరిశ్రమే కాదు.. యావత్ ప్రపంచ సినిమా స్థాయి, భాషల భేదాలు లేకుండా పైరసీల బారిన పడటం పాత విషయం. ఇప్పుడు అందర్నీ బెంబేలెత్తిస్తున్న సమస్య ఒకటే - లీక్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడో, లేకుంటే షూటింగ్‌లో ఉన్నప్పుడో, డబ్బింగ్ దశలోనో, రీరికార్డింగ్‌లోనో.. అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడపడితే అక్కడ లీకువీరులు జూలు విదుల్చుతున్నారు. 
 
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఇన్నేళ్ల కెరీర్లో ఇది ప్రభాస్‌కు 19వ సినిమా. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాహుబలి-2 సినిమా విడుదల రోజున అంటే ఏప్రిల్ 28న సాహో టీజర్‌ను రిలీజ్ చేయాలనుకున్నారు ప్రొడ్యూసర్లు. అయితే ఏ మహానుభావుడో ఆ టీజర్‌ను సైతం రికార్డు చేసి, సోషల్ మీడియాలో వదిలేసాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్లు అప్రమత్తమై అన్ని సైట్ల నుండి ఈ లీకైన టీజర్‌ను తీసేసినా, జరగాల్సిన డ్యామేజీ అప్పటికే జరిగిపోయింది. ప్రభాస్ ఒంటికి అంటిన రక్తం తుడుచుకుంటూ, "ఇట్స్ షో టైమ్" అంటూ కేవలం ఒకే ఒక్క డైలాగ్‌తో ఫ్యాన్స్ మతిపోగెట్టేసిన ఈ టీజర్‌ను వేలాదిమంది చూసేసారు. 
 
ఇక టీజర్ విషయానికొస్తే, బాహుబలిలో చక్రవర్తి గెటప్‌లో పెరిగిన జుత్తు, మెలితిప్పిన మీసాలతో రాజసంగా కనిపించిన ప్రభాస్ ఇందులో పూర్తి డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments