Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాయర్ ఝాన్సీ కేరక్టర్‌కి మంచి పేరు వ‌స్తుంది - రాశీ ఖన్నా

Webdunia
శనివారం, 2 జులై 2022 (16:49 IST)
Rasi Khanna
గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న ఆడియన్స్ తో సినిమా చూసిన  రాశిఖన్నా తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.  
 
- నేను చాలా సినిమాలు ఆడియన్స్ తో పాటు చూస్తుంటాను, ఆడియన్స్ తో సినిమా చూసే అవకాశం వేరే చోట ఉండదు. ఆడియన్స్ తో థియేటర్ లో సినిమా చూసే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది.  ఆడియన్స్ అంతా సినిమాను బాగా ఎంజాయ్ చేసారు.
 
- లాయర్ ఝాన్సీ కేరక్టర్ తో మారుతి గారు నాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఈ కేరక్టర్ నేను బాగా చేయడం కోసం మారుతి గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్స్ ఎలా చెప్పాలని మారుతి గారు మంచి హెల్ప్ చేసారు. ఏంజెల్ ఆర్నా కేరక్టర్ కంటే లాయర్ ఝాన్సీ పాత్రకు మంచి పేరు వస్తుంది.
 
- తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 8 ఇయర్స్ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి యాక్టర్స్  లైఫ్‌లో హైస్ ఉంటాయి , లోస్ ఉంటాయి.అలానే  నా లైఫ్ లో కూడా ఉన్నాయ్, కానీ ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.
 
- ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేశాను, అవి ఇంకా ఆఫీసియల్ గా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది. ఒక  వెబ్ సిరీస్ షూట్ అయిపోయి, ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుంది. అలానే కార్తీ తో చేస్తున్న "సర్ధార్" మూవీ షూటింగ్ ఇంకాస్త మిగిలుంది. అంటూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments