సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు నిజజీవితంలో హీరో హీరోయిన్లు అయ్యారు. నవంబర్ 1 న ఇటలీలోని టస్కానీలో వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక తిరిగి హైదరాబాద్ వచ్చాక మాదాపూర్ లోని ఎన్. కన్వెన్షన్ లో ఆదివారం రాత్రి వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు లావణ్య, వరుణ్ తేజ్ కుటుంబసభ్యుల సమక్షంలో సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార రంగం, క్రీడారంగం కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయి వధూవరుల్ని ఆశీర్వదించారు.