Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సర్కారు వారి పాట నుంచి లేటెస్ట్ అప్‌డేట్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (17:36 IST)
Mahesh Babu, Kirti Suresh
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు.
 
సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు.
 
మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది.
 
నటీనటులు :  మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
 
సాంకేతిక బృందం
 
రచయిత, దర్శకుడు :  పరుశురామ్ పెట్లా
నిర్మాతలు :  నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్ :  మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం  : తమన్
సినిమాటోగ్రఫీ  : ఆర్ మధి
ఎడిటర్  : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్  : ఏఎస్ ప్రకాష్
ఫైట్స్  : రామ్ లక్ష్మణ్
లైన్  ప్రొడ్యూసర్  : రాజ్ కుమార్
కో డైరెక్టర్  : విజయ రామ్ ప్రసాద్
సీఈవో  : చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : యుగంధర్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments